భర్తకు బుద్ది చెప్పిన భార్య..ఫ్యూజులు అవుటే..

-

ఈ మధ్య సోషల్ మీడియాలో మామూలు అకౌంట్ ల కన్నా కూడా ఫేక్ అకౌంట్స్ ఎక్కువగా ఫెమస్ అవుతున్నాయి..ఎవరికీ కావలసిన ఆనందం వారికి దొరుకుతుంది..ముఖ్యంగా పేస్ బుక్ లో నకిలీ అకౌంట్స్ ఎక్కువగా ఉన్నాయి.కొందరు తమ ఫాంటసీల కోసం సరదాగా ఇలాంటి అకౌంట్‌లు ఉపయోగిస్తే.. మరికొందరు ట్రాప్ చేసేందుకు వినియోగిస్తారు.

ఈ క్రమంలోనే ఓ మహిళ ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసింది. కట్ చేస్తే.. దాని నుంచి తన భర్తకే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. ఇక అతడు చేసిన చాటింగ్‌ దెబ్బకు ఆమె ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇంతకీ అసలేం జరిగింది.. అందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

వివరాల్లోకి వెళితే..ఇండోర్‌కు చెందిన ఓ మహిళ వయసులో తనకంటే పదేళ్ల పెద్దవాడైన వ్యక్తిని ఇష్టం లేకుండానే వివాహమాడింది. గవర్నమెంట్ జాబ్, ఎక్కువ ఆస్తి ఉన్నవాడు కావడంతో ఆమెకు ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యులు అతడికిచ్చి బలవంతంగా పెళ్లి చేశారు. ఇక పెళ్లి తర్వాత ఆమె జీవితం దారుణంగా తయారయ్యింది. ఆమెను ఎప్పుడూ భర్త కొట్టడం, హింసించడం చేసేవాడు. కొన్నేళ్లు భరించింది.. చివరికి మూడేళ్ల కిందట అతడి నుంచి విడాకులు తీసుకుంది. తన భర్తపై వేధింపుల కేసు పెట్టింది..

అతడి పై కేసు పెట్టిన పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఆమె ఒక ఫేక్ అకౌంట్‌ను ఫేస్‌బుక్‌లో క్రియేట్ చేసి అతడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. ఆ రిక్వెస్ట్‌ను అతడు యాక్సెప్ట్ చేశాడు. ఆమెతో చాటింగ్ కూడా మొదలు పెట్టాడు. ఆమె మెసేజ్‌లకు హద్దుమీరి అసభ్యకరంగా రిప్లయ్‌ ఇవ్వడమే కాకుండా.. మాటల్లో అతడి అసలు వయస్సు కూడా చెప్పేశాడు. అతడు తనకంటే 15 ఏళ్లు వయస్సులో పెద్దవాడని తెలిసి ఆమె షాక్ అయింది. అతడితో చేసిన చాటింగ్‌ను స్క్రీన్ షాట్లు తీసి.. అతడి బాగోతాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది…దాంతో కేసు ఆమెకు అనుకూలం అయ్యింది.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. భలే బుద్ది చెప్పావు నువ్వు గ్రేట్ అంటూ ఆమె పై ప్రశంసలను కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version