సినిమా టికెట్ల ధరలపై గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ నటీనటులకు ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి కే హీరోలు నాని, సిద్ధార్థ్, నిఖిలో అలాగే ఆర్ నారాయణ మూర్తి తో పాటు పలువురు నిర్మాతలు, దర్శకులు సినిమా టికెట్ల ధరల విషయంలో మట్లాడారు. అయితే తాజా గా ఎమ్మెల్యే రోజా కూడా ఈ విషయం పై స్పందించారు. ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని అన్నారు. జగన్ వంటి ఫ్రెండ్లీ నేచర్ ఉన్న ముఖ్యమంత్రి ఎవరూ ఉండరని అన్నారు.
సినిమాల ను థీయేటర్ కు వచ్చి పేద, మధ్య తరగతి ప్రజలే చూస్తారని అన్నారు. టికెట్ రేట్లు ఫిక్స్‌డ్‌గా ఉంటే పేద, మధ్య తరగతి వారికి సులువుగా సినిమా చూసే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే రోజా అన్నారు. కాగ సినిమా టికెట్లు ధరలు తగ్గించడంపై టాలీవుడ్ మొత్తం వ్యతిరేకిస్తున్నాయి. ఈ సందర్భంలో నటి, ఎమ్మెల్యే రోజా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సినిమా టికెట్ల ధరలపై నిర్ణయం తీసుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది.