రాష్ట్రంలో ప్రజా సమస్యలు లేవా.. జగన్ పాలనలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారా.. జగన్ పరిపాలనలో ప్రతిపక్షాలు ఇబ్బందిపడుతుండొచ్చు కానీ ప్రజలు హ్యాపీగానే ఉన్నారా అంటే… అవుననే చెబుతున్నాయి టీడీపీ నేతల ప్రవర్తనలు. అల్లరి, అలజడే వారి మనుగడను కాపాడగలదు అనుకుంటున్నారో లేక ఇంక సమస్యలు ఏమీ లేక బిల్డింగుల గురించి గొడవలు చేస్తున్నారో తెలియడం లేదు! తాజాగా ప్రజావేదిక కూల్చివేత గురించి హడావిడిచేయ నిర్ణయించారు టీడీపీ నేతలు. కరకట్టకు ఒకరితర్వాత ఒకరు చేరుకుని ఆంధోళనో, నిరసనో తెలపాలని చూస్తున్నారని పోలీసులు వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు.. దీనిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
కరోనా సమయంలో నిరసనలకు అనుమతి లేదని తెలిసి కూడా మీడియాలో కనిపిండం కోసమే ప్రజావేదిక దగ్గరకి వెళ్లారని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శిస్తుంటే… జగన్ పాలన ప్రజావేధిక కూల్చివేతతో ప్రారంభమైందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. అంతవరకూ బాగానే ఉంది కానీ.. రాష్ట్రంలో పోరాటాలు చేయడానికి, అరెస్టులు కావడానికి మరో ఆప్షన్స్ లేవా అనేది పలువురి ప్రశ్నగా ఉంది!
ప్రజలకు ఇళ్లస్థలాల పంపిణీ విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని కథనాలు వస్తున్నాయి. అర్హులైన కొంతమంది పేర్లు చేర్చలేదని, లోకల్ పాలిటిక్స్ ఈ విషయంలో కీలక భూమిక పోషిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో తమకున్న బలమైన కేడర్ సాయంతో.. ఆ అవకతవకలు ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయం తెలుసుకోవడం టీడీపీ అధిష్టాణానికి పెద్ద విషయం కాకపోవచ్చు. అయినా కూడా ఆ దిశగా కనస్ట్రక్టివ్ గా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి, తద్వారా పొలిటికల్ మైలేజ్ పొందడానికి టీడీపీ నేతలు ప్రయత్నించడం లేదని అంటున్నారు విశ్లేషకులు!
తమకోసం కాకుండా, కూల్చేసిన బిల్డింగుల కోసం మాత్రమే టీడీపీ నేతలు పోరాటాలు చేయడం వల్ల.. ప్రజల నుంచి స్పందన రాదు సరికదా.. జగన్ పాలనలో ప్రజా సమస్యలూ లేవు కాబట్టే… కూల్చేయబడ్డ ప్రజావేధికల గురించి టీడీపీ నెతలు పోరాటాలు గట్రా చేస్తున్నారనే విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం టీడీపీనేతలు గ్రహించాలని పలువురు సూచిస్తున్నారు.