ఢిల్లీలోని 113 ప్రవేశ మార్గాల వద్ద నిఘా ఉండాల్సిందే : సుప్రీంకోర్టు

-

దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో గత కొంతకాలంగా తీవ్ర వాయుకాలుష్యం  కొనసాగుతోంది. నిత్యావసరేతర వస్తువులు తీసుకొచ్చే ట్రక్కులు నగరంలోకి ప్రవేశించకుండా పోలీసు బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని కట్టడి చేయాలంటే 113 ప్రవేశ మార్గాల వద్ద నిఘా తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. “113 మార్గాల్లో దాదాపు 100 ఎంట్రీ పాయింట్లు మానవరహితంగా ఉన్నాయి. ట్రక్కుల ప్రవేశాన్ని తనిఖీ చేయడానికి ఎవరూ లేరు.ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు వెంటనే అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి” అని ఆదేశించింది.

Supreme Courts

అదేవిధంగా జీఆర్ఎ్ప-IV ఆంక్షలు సడలించాలా? వద్దా? అన్న విషయంపై వచ్చే వారం సమీక్షిస్తామని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన సుప్రీం ధర్మాసనం తెలిపింది. 13 ఎంట్రీ పాయింట్ల వద్ద రికార్డయిన సీసీటీవీ మెటీరియల్ ను అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటి పర్యవేక్షణను తనిఖీ చేయాలని బార్ సభ్యులను కోరింది. ఆ నివేదికను బట్టి గ్రాప్ 4 ఆంక్షలపై నిర్ణయం తీసుకుంటామంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version