ఢిల్లీ: మండోలి జైలు నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ కు లేఖ రాశారు మనీలాండరింగ్ కేసు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్. తనకి జైలులో రక్షణ లేదని.. తనని మరో జైలుకు బదిలీ చేయాలని లేఖలో పేర్కొన్నాడు. తనకు, తన కుటుంబానికి చివరకు తన అడ్వకేట్ కి కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు. తాజాగా జూలై 1న తన అడ్వకేట్ అనంత్ మాలిక్ కు బెదిరింపు కాల్ వచ్చిందని పేర్కొన్నారు.
“నా లేఖను అత్యవసర నోటీసుగా పరిగణించాలని లెఫ్టినెంట్ గవర్నర్ ను కోరుతున్నా. సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై నేను చేసిన ఫిర్యాదులను, స్టేట్మెంట్ లను వెనక్కి తీసుకోవాలి.. లేదంటే జైల్లో ఉన్న నన్ను ఆహారంలో విషం కలిపి చంపేస్తామని బెదిరిస్తున్నారు. జైలు నిర్వహణ ఢిల్లీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. కాల్ చేసిన వ్యక్తి కేజ్రివాల్ తో పాటు సత్యేంద్రజైన్ ఆమ్ ఆద్మీ పార్టీ పేరును ప్రస్తావించారు. జూన్ 23న మా తల్లికి కూడా ఇటువంటి బెదిరింపు కాల్ వచ్చింది.
ఢిల్లీ మాజీమంత్రి సత్యేంద్రజైన్ సతీమణి సైతం మా అమ్మకు ఫోన్ చేసింది. నేను చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలని బెదిరించింది. నన్ను జైల్ అధికారులు సైతం ఎప్పటికప్పుడు బెదిరిస్తున్నారు. మండోలి జైల్ లో నాకు భద్రత లేదు. దయచేసి ఢిల్లీ జైలు నుంచి నన్ను ట్రాన్స్ఫర్ చేయాలని వేడుకుంటున్న. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఆధీనంలో లేని మరో రాష్ట్రంలోని జైలుకు నన్ను బదిలీ చేయండి” అంటూ లేఖలో పేర్కొన్నాడు సుఖేష్ చంద్రశేఖర్.