ఆ హీరోలు కావాలని నాకు అవకాశాలు ఇవ్వరు – ఐశ్వర్య రాజేష్..!

-

ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో రాజేంద్రప్రసాద్ నటించిన రాంబంటు సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఆ తర్వాత తమిళ సినిమాలకి పరిమితమైంది. ఇక తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైంది. కానీ పెద్దగా తెలుగులో సక్సెస్ కాలేదని చెప్పాలి. ఇక తర్వాత విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఇక నాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ సినిమాలో కూడా అలరించింది.

అయితే ఈ సినిమాలేవి కూడా ఈమెకు మరిన్ని అవకాశాలను తెచ్చి పెట్టలేదు. ఇకపోతే తాజాగా తనకు కొంతమంది పెద్ద హీరోలు అవకాశాలు ఇవ్వకుండా కావాలనే అడ్డుపడుతున్నారని షాకింగ్ కామెంట్లు చేసింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా చిన్న హీరోల సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి కానీ ఇండస్ట్రీలో ఉండే పెద్ద హీరోలు తమ సినిమాలలో నాకు పాత్రలను ఆఫర్ చేయడం లేదు అందుకే నా సినిమాలకు నేనే హీరోగా ఉండాలని నిర్ణయించుకున్నాను అంటూ తెలిపింది.

ఇకపోతే తాజాగా ఐశ్వర్య ఫర్హానా అనే సినిమాలో నటించగా.. ఈ సినిమాలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మొత్తానికి అయితే స్టార్ హీరోలపై ఈమె చేసిన కామెంట్లు చాలా వైరల్ గా మారుతున్నాయి. వాస్తవానికి తెలుగమ్మాయి అయినా ఐశ్వర్య రాజేష్ ఎవరో కాదు ప్రముఖ నటుడు రాజేష్ కూతురు అలాగే ప్రముఖ సీనియర్ లేడీ కమెడియన్ శ్రీ లక్ష్మి మేనకోడలు.. ఇక తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదు అని చెప్పి మరోసారి షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news