నిర్మల్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. బైకుపై పట్టపగలే సంచరిస్తున్న ఇద్దరు.. ముధోల్ మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఉన్న హనుమాన్ ఆలయం వద్ద ఇంటి బయట బీడీలు చేసుకుంటున్న ఓ మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారాన్ని చోరీ చేశారు.
అనంతరం అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.మొహనికి కర్చీఫ్ కట్టుకుని పల్సర్ స్పోర్ట్స్ బైక్ మీద వచ్చిన దొంగలు.. ముందుగా రెక్కీ నిర్వహించి మహిళ మెడలోంచి గొలుసు దొంగిలించినట్లు తెలిసింది. దీనికి సంబంధించి విజువల్స్ స్థానికంగా ఓ భవనానికి అమర్చిన సీసీటీజీ ఫుటేజీలో లభ్యమయ్యాయి. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.