ఇదేందయ్యా ఇది.. మత్తులో హుక్కా పీలుస్తూ స్నేహితురాలికి లిప్ లాక్ ఇచ్చిన ప్రముఖ నటి..!!

-

ఇటీవల కాలంలో సెలబ్రిటీలు ఎక్కువగా పబ్ లు, రెస్టారెంట్లు, రేవు పార్టీలు అంటూ విచ్చలవిడిగా తిరిగేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు వీరు అక్కడికి వెళ్లడమే కాకుండా అక్కడ వీరు చేసే వింత వింత చేష్టలకు నెటిజన్ల చేతుల్లో పూర్తిగా ట్రో ల్ కి గురి అవుతున్నారు. ఇక ముఖ్యంగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ కిడ్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవన్నీ వారికి ఒక డైలీ వారి రొటీన్ అయిపోయాయి. ఇదిలా ఉండగా తాజాగా కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ నిష్విక నాయుడు మత్తులో తన స్నేహితురాలికి లిప్ లాక్ ఇచ్చిన సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఆమె హుక్కా పీలుస్తూ మత్తులో ఏం చేస్తుందో తనకే తెలియకుండా తన స్నేహితురాలికి లిప్ లాక్ ఇచ్చి.. మరింత రెచ్చిపోయింది. అంతేకాదు ఆ అమ్మాయిని ముద్దులతో ముంచెత్తింది ఈ ముద్దుగుమ్మ. ఇందుకు సంబంధించిన వీడియో కన్నడ మాధ్యమాలలో బాగా వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం. ఇక ఈమె సినీ కెరియర్ విషయానికి వస్తే 2018లో వాసు నాన్ పక్క కమర్షియల్ సినిమాలో అనీష్ తేజేశ్వర్ సరసన నటించింది. ఇక తర్వాత అమ్మ ఐ లవ్ యు చిత్రం ఈమె రెండవ సినిమాగా నటించగా మొదట విడుదల కావడం గమనార్హం. ఆ తర్వాత మరికొన్ని సినిమాలలో నటించిన ఈమె అనీష్ తేజేశ్వర్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం రామార్జునా సినిమాలో కూడా కథానాయకగా నటించింది.

ఇకపోతే అమ్మ ఐ లవ్ యు సినిమాకు 66వ ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకోవడమే కాకుండా సైమ అవార్డులను కూడా పొందింది. ఇకపోతే కర్ణాటకలోనే బెంగళూరుకు చెందిన ఈమె బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కళాశాల నుండి మనస్తత్వశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఇక ప్రముఖ నటుడు ఉపేంద్ర తో కలిసి ఒక సినిమాలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా ఈమె లిప్ లాక్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version