పార్టీ మార్పుపై తుమ్మల క్లారిటీ.. చివరి వరకు కేసీఆర్ తోనే !

ఖమ్మం జిల్లా : పార్టీ మార్పు పై వస్తున్న వార్తలపై తమ్మల నాగేశ్వరరావు ఇవాళ స్పందించారు. నేలకొండపల్లి మండల చెన్నారం గ్రామంలో విలేకరుల సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ… తాను టిఆర్ఎస్ పార్టీ లో చేరేటప్పుడే చెప్పా… ఈ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ మనుగడ కొనసాగిస్తున్నప్పుడు.. ఇంకో పార్టీ కి అవకాశం ఉండదన్నారు. ఈ నేపథ్యంలో కేసిఆర్ కు నాకు సుదీర్ఘ కాలం పాటు రాజకీయ నేపథ్యం.. మా ఇద్దరి మధ్య ఉన్న సన్నిహిత్యంతో.పాటు జిల్లా అభివృద్ధి కోసం కేసీఆర్ ఆహ్వానం మేరకు పార్టీ లో చేరానని తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం కాని భారీ ప్రాజెక్టులు కోసం.. జిల్లా అభివృద్ధి కోసం తన వంతు కృషి చేసానన్నారు. ఢిల్లీలో ఇప్పటి వరకు ఏ ప్రాంతీయ పార్టీ కి.. కార్యాలయం లేదు… టిఆర్ఎస్ పార్టీ కి ఆ గౌరవం దక్కింది. తెలంగాణ అస్తిత్వంకు ఢిల్లీలో గౌరవం దక్కిందని కొనియాడారు. అదే విధంగా ముఖ్యమంత్రి సహకారం తో ప్రాజెక్టులు,హైవే రోడ్లు, అంతర్గత రోడ్లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, కొన్ని పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. వాట్సప్ గ్రూపు ల్లో నేను పార్టీ మారుతున్నారనే ప్రచారం తప్పుఅని వివరించారు తమ్మల.