పులి వెంటబడితే.. చాలా తెలివిగా తప్పించుకున్నారు.. వైరల్ వీడియో..!

-

అడవిలో వెళ్తున్నప్పుడు పులి మీ వెంట పడితే.. ఆ సమయంలో ఎలా ఉంటుంది..? ఊహించుకోవడానికే భయం వేస్తుంది కదా.. ఒక వేళ నిజంగానే ఎవరికైనా అలాంటి పరిస్థితి ఎదురైతే తప్పించుకోవడం కష్టమే. కాలి నడకన వెళ్తుంటే.. పులి వెంటబడితే తప్పించుకోలేమేమోగానీ, ఏదైనా వాహనంలో వెళ్తున్నప్పుడు పులి వెంబడిస్తే.. తప్పించుకోవడం కొంత వరకు సులభమే. అవును.. సరిగ్గా వారు కూడా అలాగే చేశారు. తమ వెంటబడిన పులి నుంచి అత్యంత చాకచక్యంగా వారు తప్పించుకున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?

రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్కులో ఓపెన్ టాప్ జీపులో సఫారి చేస్తున్న టూరిస్టులను ఓ పులి భయపెట్టింది. వారు వాహనంలో వెళ్తుండగా ఆ పులి వారి వెంట పడింది. అయితే వారు కొంత దూరం ముందుకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చి అత్యంత తెలివిగా ఆ పులి బారి నుంచి తప్పించుకుని, అక్కడి నుంచి బయటపడ్డారు. కాగా ఆ సమయంలో తీసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది ఆ వీడియోను చూసి భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. కొందరేమో.. టూరిస్టులకు మద్దతు పలుకుతూ బాగా తప్పించుకున్నారని కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు మాత్రం.. అడవుల్లోకి మనుషులు వెళ్లడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు. అయితే ఆ పులి బారి నుంచి తప్పించుకున్నందుకు మాత్రం ఆ టూరిస్టులు హమ్మయ్య.. అని ఫీలయ్యారు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version