సెప్టెంబర్‌లో “శ్రీవారి బ్రహ్మోత్సవాలు” తేదీలు

-

కలియుగ వైకుంఠం శ్రీవారి నిలయం తిరుమల. స్వామివారికి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఈసారి సెప్టెంబర్‌ 19న ప్రారంభం కానున్నాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం.. సెప్టెంబర్ నెలలో కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగునున్నాయి. 19వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై, 27న శ్రీవారి చక్ర స్నానం, ధ్వజావరోహణంతో ముగుస్తాయి. దీనికి సంబంధించి టీటీడీ విడుదల చేసిన వివరాలు..

– సెప్టెంబరు 18న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
– సెప్టెంబరు 19న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
– సెప్టెంబరు 23న శ్రీవారి గరుడసేవ.
– సెప్టెంబరు 24న శ్రీవారి స్వర్ణరథోత్సవం.
– సెప్టెంబరు 26న రథోత్సవం.
– సెప్టెంబరు 27న శ్రీవారి చక్రస్నానం, ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమాప్తి.
– సెప్టెంబరు 28న శ్రీవారి బాగ్ సవారి ఉత్సవం.
ఇవి స్వామి వారి బ్రహ్మోత్సవాల తేదీలు.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version