శ్రీవారి సన్నిధిలో హైటెక్ వ్యభిచార దందా…బెరాలన్నీ వాట్సాప్ లోనే !

-

తిరుపతి నగరంలో గుట్టుగా సాగుతున్న హైటెక్ వ్యభిచార దందాను రట్టు చేశారు తిరుపతి ఈస్ట్ పోలీసులు. నగరంలోని శ్రీ నగర్ కాలనీలో రహస్యంగా వ్యభిచార దందా కొనసాగుతోంది.. అయితే వాట్సాప్ ద్వారా విటులను ఆకర్షించి జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.

ఈ నేపథ్యం లోనే మంగళవారం రాత్రి ఓ ఇంట్లో ఆసస్మికంగా దాడి చేసిన తిరుపతి పోలీసులు.. ఏకంగా నలుగురు విటులు, నిర్వాహకులను అరెస్టు చేశారు. వ్యభిచార నిర్వహిస్తున్న వారిని కర్ణాటక రాష్ట్రం, బళ్లారికి చెందిన స్వప్న, లక్ష్మి ప్రియగా గుర్తించారు పోలీసులు. యువతుల ఫొటోలను సాయిచరణ్, అనిరుధ్ కుమార్ లు విటులకు పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇక బెంగుళూరు, గుడివాడ నుంచి యువతలను తిరుపతి నగరానికి తీసుకు వచ్చి ఈ హైటెక్ వ్యభిచార దందాను నిర్వహిస్తున్నారు. ఈ దాడుల సందర్భంగా నిందితుల నుంచి మరి కొంత మంది యువతులను రక్షించారు తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు. అలాగే కేసు నమోదు చేసిన పోలీసులు.. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version