పసిడి ప్రియులకు షాక్‌.. పెరిగిన బంగారం ధరలు..

-

మరోసారి పసడి పరుగులు పెట్టింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.48,350గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.600 పెరిగింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఒక్కగ్రాము బంగారం ధరల రూ.4,835కి ఎగబాకింది. పెట్టుబడుల్లో వినియోగించే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర.. హైదరాబాద్‌లో రూ.52,750కి చేరింది. నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.650 పెరిగింది. హైదరాబాద్‌లో ఒక్క గ్రాము స్వచ్ఛమైన బంగారం రేటు రూ.5,275కి ఎగబాకింది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్టణం, ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, కేరళలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి.

ఇక్కడ తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ.48,350కి అందుబాటులో ఉంది. 24 క్యారెట్ల బంగారం తులం రేటు రూ.52,750గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.48,420గా ఉంది. పుణెలో రూ.48,400, అహ్మదాబాద్‌లో రూ.48,380, జైపూర్‌లో రూ.48,500, పాట్నాలో రూ.48,400, భువనేశ్వర్‌లో రూ.48,350కి అందుబాటులో ఉంది. గడిచిన 10 రోజుల్లో పసిడి ధరలు ఐదుసార్లు పెరిగాయి. నాలుగు సార్లు తగ్గాయి. సాధారణంగా బంగారం ధరలు పెరిగితే.. తులంపై 200 లేదా 300 పెరుగుతుంది. కానీ ఈసారి ఏకంగా 600 పెరగడం విశేషం. అయితే.. బంగారం రేటు పెరిగితే ..వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,000గా ఉంది. నిన్నటితో పోల్చితే ధరలో మార్పులేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో తులం వెండి రూ.670కి అందుబాటులో ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version