హైదరాబాద్: భారత్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు బంగారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 510 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 48 వేల 560గా ఉంది. శుక్రవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,500గా ఉంది. దీంతో పోల్చుకుంటే శనివారం రూ.10 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం శుక్రవారం రూ. 48.550 కాగా ఈ రోజు రూ. 10 మాత్రమే పెరగడం విశేషం. అటు వెండి ధరలు కూడా పెరిగాయి. కేజీ వెండి ధర రూ. 75 వేల100గా ఉంది. నిన్నటితో పోల్చుకుటే దాదాపు రూ.1900 పెరిగింది. ఆరు నెలల్లో వెండి ధర కేజీపై రూ.10 వేల 690 పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని బంగారం వ్యాపారులు అంచనా వేస్తున్నారు.