NDA కూటమిలో బాబు, నితీష్‌ పార్టీలకు కీలక పదవులు?

-

NDA కూటమిలో బాబు, నితీష్‌ పార్టీలకు కీలక పదవులు రానున్నాయి. ఎన్.డి.ఏ కి కీలకంగా టిడిపి (16 లోకసభ స్థానాలు), “జనతా దళ్-యునైటెడ్” (12 లోకసభ స్థానాలు) భాగస్వామ్య పక్షాలు మారాయి. గత దశాబ్దకాలంలో 5 సార్లు “పొత్తు స్నేహాలు” మారారు నితీశ్ కుమార్. ఇటీవలే “ఇండియా” కూటమి నుంచి తిరిగి బిజేపితో చేతులు కలిపారు జేడి-యు నేత, బీహార్ సిఎమ్ నితీష్ కుమార్. టీడీపీ, జేడీయూ పార్టీల మద్దతుతో బీజేపీ అధికారంలోకి రానుంది.

అయితే… ప్రధాని అభ్యర్థిగా మూడోసారి కూడా నరేంద్ర మోడీ యే ఉంటారా…!? లేదా అనే అంశం పై బిజేపి లో అంతర్గతంగా చర్చ జరిగే అవకాశం ఉంటుందా? లేదా అనేదే రాజకీయ పరిశీలకుల్లో ప్రశ్న తలెత్తుతోంది. మొత్తానికి NDA కూటమిలో బాబు, నితీష్‌ పార్టీలకు కీలక పదవులు రానున్నాయని చెబుతున్నారు. ఇక అటు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు, ఎన్.డి.ఏ, “ఇండియా” కూటమి సమావేశాలు ఉండనున్నాయి. ఢిల్లీకి ఎన్.డి.ఏ, “ఇండియా” కూటమి కీలక భాగస్వామ్య పక్షాల నేతల సమావేశం ఉంటుంది. ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే నివాసంలో ఈ రోజు 4 గంటలకు ఇండియా కూటమి సమావేశం ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటుకున్న అవకాశాలను, కొత్తగా భాగస్వామ్య పక్షాలను సంప్రదించే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది “ఇండియా” కూటమి.

Read more RELATED
Recommended to you

Exit mobile version