రేపే “విరాటపర్వం” ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే..

-

వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా కథానాయకుడిగా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మితమైన చిత్రం ‘విరాటపర్వం’. 1990 నాటి నక్సలిజం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. నక్సలైట్ నాయకుడిగా ఈ సినిమాలో రానా కనిపించనున్నాడు. ఆయనను ఆరాధించే యువతిగా సాయిపల్లవి కనిపించనుంది. కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి ఈ నెల 17వ తేదీన ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీని, వేదిక ను ఖరారు చేశారు. రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ‘కర్నూలులో’ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక పోస్టరును కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఈ సినిమాకి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చారు. ప్రియమణి, నందితాదాస్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న రానాకి ఈ సినిమా ఆ లోటు తీరుస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version