Tourists Spots in India : ఇండియాలో టాప్ 5 టూరిస్ట్ స్పాట్​లు ఇవే..!

-

ఫ్రెండ్స్​తో టూర్​కి వెళ్లాలంటే.. ఫ్యామిలీ ట్రిప్​కి వెళ్లాలన్నా.. భార్యాభర్తలు కలిసి వెళ్లాలన్నా.. ఇండియాలో అయితే ఉత్తర్ భారత్​లో దిల్లీ, జైపూర్ దక్షిణ భారత్​లో అయితే కేరళ, కన్యాకుమారి ఇలాంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. లేదా కాస్త ఉన్నోళ్లయితే విదేశాలకు వెళ్తారు. కానీ ఇండియాలోనే మీకు తెలియని చాలా అందమైన ప్రదేశాలున్నాయి. ముఖ్యంగా స్విట్జర్లాండ్​ లాంటి మంచు ప్రాంతాలను తలపించే సోయగాలు మన భారతంలోనే చాలా ఉన్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందామా..? మీ నెక్స్ట్ వెకేషన్ వీటిలో ఏదైనా అవ్వొచ్చు.. అందుకే ఓ సారి లుక్కేయండి..!

కూర్గ్ : కర్ణాటక కశ్మీర్​గా పిలుచుకనే ప్రాంతం కూర్గ్. ఇది హనీమూన్ కపుల్స్​కు భూతల స్వర్గం. చాలా కొత్త జంటల మొదటి ప్రేమ పుట్టింది ఇక్కడే. పచ్చని వాతావరణంతో కాఫీ తోటల పరిమళంతో ఈ ప్రాంతం సందర్శకులను కట్టిపడేస్తుంది. అందుకే ఒకసారి వెళ్లిన వాళ్లు మళ్లీమళ్లీ వెళ్లాలనుకుంటారు. ఇక్కడి జలపాతాలు చెర్రీ ఆన్ ది కేక్ అన్నమాట. చెట్లపైన ఉండే హోటల్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో మాటల్లో వర్ణించలేం. తక్కువ బడ్జెట్​లో స్వర్గవిహారం చేయాలనుకుంటే కూర్గ్ బెస్ట్ ప్లేస్.


అండమాన్ దీవి : పైన నీలిరంగు ఆకాశం.. అది కిందపడిందా అన్నట్లు అదే నీలిరంగులో నీటిని పరుచుకుని ఉన్న దీవి. నేను చెప్పేది అండమాన్ దీవి గురించేనండి. పచ్చని చెట్ల మధ్యలో నీలి రంగు భూతల స్వర్గం ఈ దీవి. ప్యారెట్ ఐల్యాండ్ ప‌క్షులు, ఆక్వా ప్రేమికుల‌కు బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. పర్యాటకుల మనసు దోచే ఈ అండమాన్​ దీవికి ప్రతి ఒక్కరు తమ లైఫ్​లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే.

పుష్క‌ర్ : పుష్క‌ర్ అంటే నీలి తామర పువ్వు అని అర్థం. ఎన్నో చారిత్రక ప్రదేశాలకు కొలువైన ఈ రాష్ట్రంలో ది బెస్ట్ ప్లేస్ అంటే పుష్కర్. ఇక్కడి పెంపుడు జంతువుల సంత చాలా స్పెషల్. ఇక్కడికి టూర్​కి వచ్చిన వాళ్లు తప్పకుండా ఏదో ఒక పెట్​ని తమ వెంట తీసుకెళ్తారు. పుష్కర్​లో ఒంటె సవారీ సూపర్​గా ఉంటుంది. ఈసారి టూర్​ ప్లాన్ చేస్తే అందులో పుష్కర్ తప్పకుండా ఉండేలా చూసుకోండి.

చంద్రతాల్ : సరస్సులంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. హిమాచల్ ప్రదేశ్​లో ఓ అందమైన సరస్సు ఉంది. దాని పేరు చంద్రతాల్. చంద్రుడి ఆకారంలో ఉంటుందని దీనికి ఆ పేరు పెట్టారు. ట్రెక్కింగ్ అంటే ఇష్టపడే వాళ్లు ఇక్కడికి వెళ్లొచ్చు. లోతైన నీలిరుంగు సరస్సు.. మంచుతో కప్పిన పర్వతాలు.. పచ్చని చెట్లు.. వావ్.. చెబుతోంటేనే దిమ్మదిరిగిపోతోంది కదా ఇక వెళ్తే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ఇక్కడికి వెళ్తే మీ లైఫ్​లో ఓ మంచి మెమొరీ క్రియేట్ అవుతుంది.

సోలాంగ్ వ్యాలీ : స్విట్జర్లాండ్​కి వెళ్లాలనిపిస్తోందా.. కానీ మీ బడ్జెట్ సహకరించట్లేదా అయితే మీ కోసమే మన ఇండియాలోనూ ఓ స్విట్జర్లాండ్ ఉంది. అదే సోలాంగ్ వ్యాలీ. హిమాచల్ ప్రదేశ్​లో ఉన్న ఈ వ్యాలీని చూస్తే స్విట్జర్లాండ్​లో ఉన్న ఫీల్ కలుగుతుంది. మంచుతో కప్పిన పర్వతాలు.. దట్టమైన అడవులు.. నీలి రంగులో ఆకాశం ఎంత అందంగా ఉంటుందో. మీ ఫ్రెండ్స్​తో టూర్​కి వెళ్తే ఆ లిస్టులో ఈ ప్లేస్ తప్పక ఉండాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version