హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. ఈ ఏరియాలలో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు..

-

హైదరాబాద్‌ వాసులకు గమనిక. నగరంలోని సీతాఫల్‌ మండి ఏరియాలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు. సీతాఫల్​మండి రోడ్​లో సీవరేజీ​ పనులు జరుగుతున్న నేపథ్యంలో బుధవారం నుంచి డిసెంబరు11 వరకు వెహికల్స్ దారి మళ్లింపు ఉంటుందని గోపాలపురం ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వాటర్ సప్లయ్ సీవరేజీ పనులతో దాదాపు 12 రోజుల పాటు ఈ రోడ్డును పూర్తిగా మూసివేయనున్నట్లు చెప్పారు. చిలకలగూడ క్రాస్ రోడ్ నుంచి వచ్చే వాహనదారులు ఆలుగడ్డ బావి మీదుగా మెట్రో పిల్లర్ 1139 వద్ద యూటర్న్ తీసుకుని రైల్వే క్వార్టర్స్ ​మీదుగా సీతాఫల్​మండి వైపు వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలను గమనించి వాహనదారులు సహకరించాలని కోరారు.

గచ్చిబౌలి : ఐటీ కారిడార్​లో నేటి నుంచి మూడ్రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు
ఉత్తర్వులు జారీ చేశారు. నానక్​రామ్ గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్​లోని సత్వ నాలెడ్జ్ క్యాపిటల్​లో నిర్మాణ పనుల కారణంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలకు వెహికల్స్ దారి మళ్లింపు ఉంటుందన్నారు. వెస్ట్ బిల్డింగ్ నుంచి హయత్ హైదరాబాద్ వైపు వచ్చే వెహికల్స్ వేవ్ రాక్ జంక్షన్ మీదుగా, ఐసీసీఐ బ్యాంక్ జంక్షన్ నుంచి వెస్ట్ బిల్డింగ్ సర్వీస్ రోడ్ వైపు వచ్చే వెహికల్స్ హయత్ హైదరాబాద్ జంక్షన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version