ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

-

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన కూటమి ప్రభుత్వం.. అధికారంలో రాగానే పాలనపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే అన్ని వ్యవస్థల పై ఫోకస్ పెట్టిన ముఖ్యమంత్రి పలువురు అధికారులకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఏపీలో మంగళవారం సాయంత్రం భారీగా ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. విశాఖ కలెక్టర్ గా హరీంద్ర ప్రసాద్, సత్యసాయి జిల్లా కలెక్టర్ గా చేతన్, అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా చామకూరి శ్రీధర్,కడప జిల్లా కలెక్టర్ గా లోతేటి శివశంకర్, తిరుపతి జిల్లా కలెక్టర్ గా వెంకటేశ్వర్,శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా స్వప్నిక్ దినకర్, నెలుర్ కలెక్టర్‌గా ఆనంద్,పల్నాడు కలెక్టర్‌గా అరుణ్ బాబు, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గా శ్యామ్ ప్రసాద్, అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్‌గా రావిరాల మహేశ్ కుమార్,అనకాపల్లి కలెక్టర్ గా కె. విజయ, నంద్యాల కలెక్టర్ గా రాజకుమారిలను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version