కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు కరోనా బారినపడుతున్న నేపథ్యంలో తాజాగా.. త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహాకు కరోనా సోకింది. కరోనా పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని బుధవారం వెల్లడించారు మాణిక్ సాహా. అయితే తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు మాణిక్ సాహా. తనను కలిసిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మాణిక్ సాహా. బుధవారం ఒక ట్వీట్ చేశారు. కరోనా టెస్ట్ రిపోర్ట్‌ను కూడా అందులో పోస్ట్ చేశారు మాణిక్ సాహా.
‘ఈ రోజు నాకు జరిపిన కరోనా పరీక్షలో కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. నేను పూర్తిగా ఫిట్‌గా ఉన్నాను. ఎటువంటి లక్షణాలు లేవు. నన్ను సంప్రదించిన వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను’ అని అందులో పేర్కొన్నారు మాణిక్ సాహా. కాగా, త్రిపుర తొలి బీజేపీ సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ స్థానాన్ని మాణిక్ సాహా భర్తీ చేశారు. ఈ ఏడాది
మే 14న అనూహ్యంగా ఆ రాష్ట్ర సీఎం అయ్యారు మాణిక్ సాహా. డెంటల్ సర్జన్ నుంచి రాజకీయ నేతగా మారిన ఆయన జూన్ 26న జరిగిన ఉప ఎన్నికల్లో తగిన మెజార్టీతో గెలిచారు మాణిక్ సాహా.