మ‌హేశ్‌ను సెట్ చేసుకున్న త్రివిక్ర‌మ్‌.. వెయిటింగ్ లిస్టులో ప‌డ్డ అనిల్ రావిపూడి

-

ఎవ్వ‌డు సినిమా తీస్తే ఇండ‌స్ట్రీ షేక్ అవుతుందో అత‌నే సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ హీరో ప్రస్తుతం వరుస హిట్స్ తో సూప‌ర్‌ ఫామ్ లో ఉన్నాడు. అయితే ఈ హీరో విషయంలో ఇప్పుడు ఇద్దరు అగ్ర దర్శకుల మధ్య ఫైట్ నెల‌కొంది.కార‌ణం వీరిద్ద‌రూ మ‌హేశ్ తో సినిమా చేయాల‌ని అనుకు‌న్నారు. కానీ ఇందులో ఒక‌రితోనే మ‌హేశ్ సినిమా ఉంటుంద‌ని టాక్‌. ఒక‌ స్టార్ హీరోతో సినిమా చేయ‌డానికి నలుగురైదురు డైరెక్ట‌ర్లు ట్రై చేస్తూంటారు. కానీ అందులో ముందుగా ఒకరికే అవ‌కాశం వస్తుంది. ఆ సినిమా పూర్త‌య్యేదాకా మిగతా వాళ్లు వెయిట్ చెయ్య‌క త‌ప్ప‌దు. పోనీ వేరే హీరోతో చేద్దామంటే మళ్లీ ఆ స్టార్ హీరో దొరుకుతాడో లేడో అని త‌ప్ననిస‌రిగా వెయిట్ చేస్తుంటారు.


ఇప్పుడు ఇదే కోవ‌లో త్రివిక్రమ్ వల్ల అనీల్ రావిపూడి వెయిట్ చేయాల్సి వ‌స్తోంది. ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉన్న అనీల్ రావిపూడి.. తన త‌ర్వాత‌ సినిమాని మహేష్ బాబుతో చేయాల‌నుకున్నాడు. ఇందుకోసం ఇప్పటికే ఓ స్టోరీ కూడా రెడీ చేసుకున్నాడు. సెప్టెంబర్ నెల నుంచి షూట్ కు కూడా ప్లాన్ చేద్దామ‌ని అనుకున్నాడు. ఇక్క‌డే ఓ ట్విస్ట్ జ‌రిగింది. అనూహ్యంగా వీరి మ‌ధ్య‌లోకి త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చేసాడు.

ఎన్టీఆర్ కొన్ని కారణాలతో త‌న 30వ సినిమాకు త్రివిక్రమ్ ను వద్దనుకుని కొరటాల శివతో ఫిక్స్ అయ్యాడు. దాంతో ఎన్టీఆర్ తో త్రివిక్ర‌మ్ అనుకున్న సినిమా ఆగిపోయింది. ఇక చేసేది లేక త్రివిక్రమ్ మ‌హేశ్‌ను లైన్ లో పెట్టాడు. ఇక్కడ ఆల్రెడీ లైన్ లో ఉన్న అనీల్ రావిపూడి త‌ప్ప‌ని స‌రిగా త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. త్రివిక్రమ్, మహేష్ సినిమా ఆగస్టు లో మొదలవుతుంది. ఈ సినిమా పూర్తవగానే మ‌హేశ్ రాజమౌళితో చేయ‌నున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యేస‌రికి మ‌రో నాలుగేళ్లు ప‌ట్టేలా ఉంది. దీంతో ఇప్పుడు అనిల్ రావిపూడి అన్నేళ్లు మ‌హేశ్ కోసం వెయిట్ చేస్తాడా లేదా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version