బీజేపీ నేతల పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. – హరీష్ రావు.

-

ధాన్యం కొనుగోలు విషయంపై కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలపై మంత్రి హరీష్ రావు ఫైరయ్యారు. ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే అని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ నేతలు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు హరీష్ రావు. కేంద్రం వడ్లు కొంటే ఈ ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చేదన్నారు. మేము ఏం గొంతెమ్మ కోరికలు, తగని కోరికలు కోరడం లేదన్నారు. ఇంతకు ముందు ధాన్యాన్ని కొన్న కేంద్రం ఇప్పుడు ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, కాళేశ్వరం నీరు ఇస్తున్నాం.. మరో నాలుగేళ్లలో తెలంగాణ రైతులు బాగుపడుతారని అనుకుంటున్న దశలో బీజేీపీ వడ్లు కొనమని మొండికేస్తుందని అన్నారు.

రైతుల బాగు కోసం రూ. 7800 కోట్లు రైతుబంధు కింద ఈనెల 28 నుంచి రైతులకు ఇస్తామని కేసీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు కింద రూ. 50 వేల కోట్లను ఇచ్చామని హరీష్ రావు వెల్లడించారు.  రైతులకు ఉచిత కరెంట్ వస్తుందంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం అన్నారు. ఢిల్లీలోె ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఒక్క వడ్లు కొనమంటే కొనకుండా చేతులెత్తేసిందన్నారు హరీష్ రావు. యాసంగిలో వడ్లు పండాలే.. కానీ కొనద్దని బీజేపీ అనుకుంటుందని.. రైతుల కోపాన్ని టీఆర్ఎస్ వైపు మళ్లేలా చేస్తుందని హరీష్ రావు అన్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు బీజేపీ నాటకమాడుతుందని దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version