టీఆర్ఎస్ పార్టీ ఈనెల 17న సంయుక్త సమావేశం ఏర్పాటు చేసింది. కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఎల్లుండి మధ్యహ్నం 2 గంటలకు సీఎం అధ్యక్షతన భేటీ జరుగనుంది. ఈ భేటికీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. వీరితో పాటు జడ్పీ చైర్మన్లు, డీసీఎంఎస్ అధ్యక్షులు, డీసీబీసీ అధ్యక్షులు, కార్పోరేషన్ చైర్మన్లు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు హాజరుకానున్నారు. ఇప్పటికే అందరికి ఆహ్వానం అందినట్లు సమాచారం.
ముఖ్యంగా రాష్ట్రంలో వరి ప్రత్యామ్నాయ పంటలపై చర్చ జరుగనుంది. రాష్ట్రంలో ఏ పంటలు వేస్తే లాభమనే అంశంపై పార్టీ నాయకులతో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. ఇదే విధంగా రాష్ట్రంలో పార్టీ పటిష్టంపై నాయకులుకు సీఎం సూచనలు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది.