వామనరావు దంపతుల హత్య టీఆర్ఎస్ నేత పనే..నిర్దారణకు వచ్చిన పోలీసులు !

-

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచర్లలో లాయర్ వామనరావు దంపతులు దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. మంధని నుండే హైదరాబాద్ వెళ్తుండగా దుండగులు కత్తులతో దాడి చేసి చంపారు. ఆ దాడిలోనే వామన రావు ఆయన భార్య నాగమణి ఇద్దరూ మృతి చెందారు. తమ మీద దాడి చేసింది కుంట శ్రీనివాస్ అతని అనుచరులే అని వామన రావు వాంగ్మూలం ఇచ్చారు. నాలుగు బృందాలతో కేసు విచారణ ప్రారంభించిన పోలీసులు మంధనిలోని ఒక ఆలయం వ్యవహారంలో కుంట శ్రీనివాస్ అక్రమాలకు పాల్పడుతున్నాడని వామనరావు పిటిషన్ వేశారని పోలీసులు గుర్తించారు.

దీంతో ఈ దంపతుల కదలికలను ఎప్పటికప్పుడు శ్రీను గ్యాంగ్ పరిశీలించినట్టు గుర్తించారు. మంధని టీఆర్ఎస్ మండల అధ్యక్ష్యుడు శ్రీనివాసే ఈ హత్యలకు కారణం అని గుర్తించారు పోలీసులు. 120బీ, 302, 341, 34 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అతని కారు, కారు టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్, సీసీ టీవీ ఫుటేజ్ ల ద్వారా కుంట శ్రీనివాస్ ఘటనా స్థలంలోనే ఉన్నాడని పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version