తెలంగాణ మినీ పురపోరులో కేటీఆర్ సరికొత్త వ్యూహం

-

తెలంగాణ మరో ఎన్నికల యుద్దానికి సిద్దమవుతున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు. ఇక ప్రతి ఎన్నికను గెలిచి తీరాలని కసితో పని చేస్తున్న అధికార టీఆర్ఎస్ మినీ మున్సిపల్ వార్ పై దృష్టిపెట్టింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎన్నికల వ్యూహాన్ని సిద్దం చేసింది అధికార పార్టీ. రెండు మునిసిపల్ కార్పొరేషన్లతో పాటు అయిదు మునిసిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల్లో పటిష్ట వ్యూహంతో విపక్షానికి చాన్స్ లేకుండా ప్రణాళిక సిద్దం చేసింది. అభ్యర్ది ఎంపిక మొదలు పోలింగ్ వరకు అన్ని తామై నిర్వహించేందుకు ఓ భారీ టీంని రంగంలోకి దింపనుంది.

రాష్ట్రంలో రెండు మునిసిపల్ కార్పొరేషన్లతోపాటు అయిదు మునిసిపాలిటీలకు ఎన్నికల్లో నామినేషన్ల పర్వానికి తెరపడింది. ఏప్రిల్ 30న పోలింగ్ నిర్వహించి, మే మూడో తేదీన ఓట్ల లెక్కిపు చేపట్టి ఫలితాన్ని ప్రకటిస్తారు. కేసీఆదేశాలతో ఎన్నికల భాద్యతలు తీసుకున్న కేటీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు సీనియర్ నేతలకు ఈ ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. వీరంతా పార్టీ వర్గాలతో కలిసి పని చేయాల్సి వుంటుంది.

స్థానిక ఎన్నికలైనందున ఆయా జిల్లాల మంత్రుల ఆధ్వర్యంలోనే పార్టీ వర్గాలు పనిచేయాలని అధిష్ఠానం నిర్ణయించింది. వరంగల్‌కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎమ్మెల్యేలు.., ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, సిద్దిపేటకు మంత్రి హరీశ్‌రావు, జడ్చర్ల, కొత్తూరు పురపాలికలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, అచ్చంపేటకు మంత్రి నిరంజన్‌రెడ్డి, నకిరేకల్‌కు మంత్రి జగదీశ్‌రెడ్డిలకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు.

కార్పొరేషన్లలో ఒక్కో డివిజన్‌ ఒక్కో ముఖ్యనేతను, పురపాలికల్లో ప్రతి మూడు, నాలుగు వార్డులకు ఓ ముఖ్య నాయకుడు ప్రచార బాధ్యతలు చేపడతారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను స్థానిక నేతలకే బాధ్యతలు అప్పగించారు వర్కింగ్ ప్రెసిడెంట్. పార్టీ వ్యూహానికి అనుగుణంగా వీరు స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా ప్రచారావ్యూహాన్ని సిద్దం చేసుకున్నారు. మినీ పోరు ప్రచారానికి మరో తొమ్మిది రోజుల సమయమే మిగిలి ఉంది. వరంగల్‌, ఖమ్మంలలో రెండేసి రోజులు కేటీఆర్‌ రోడ్‌షో లు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version