Breaking : గురుకుల కాంట్రాక్ట్‌ టీచర్లకు గుడ్‌న్యూస్‌.. క్రమబద్దీకరణ ఉత్తర్వులు జారీ…

-

తెలంగాణ ప్రభుత్వం గురుకుల కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులకు టీచర్స్‌ డే సందర్భంగా శుభవార్త చెప్పింది. ఇప్పటికే బీసీ గురుకులాల్లోని 139 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులర్‌ చేసిన ప్రభుత్వం.. తాజాగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న 567 మంది కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులను క్రమబద్దీకరించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

2007లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మొత్తంగా 567 మంది ఉపాధ్యాయులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించింది. అందులో స్టాఫ్‌ నర్సులతోపాటు, లైబ్రేరియన్లు కూడా ఉన్నారు. అయితే రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పనిచేయించిన నాటి ఉమ్మడి ప్రభుత్వం వేతనాలను మాత్రం ఇవ్వలేదు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం మానవీయకోణంలో ఆలోచించి.. గురుకులాల్లో కాంట్రాక్టు ఉపాధ్యాయులకు రెగ్యులర్‌ ఉపాధ్యాయులతోపాటు పీఆర్సీని అమలు చేయడంతోపాటు, 12 నెలల పూర్తి వేతనాన్ని చెల్లిస్తున్నది.కాగా, గతంలో ఇచ్చిన హామీ మేరకు తాజాగా సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులర్‌ చేయాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం సోమవారం జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version