తిరుమల శ్రీవారి దర్శన విషయంలో టీటీడీ అవలంబిస్తున్న ద్వంద వైఖరి వెలుగులోకి వచ్చింది. అధికార పార్టీ నాయకులకు ఒక్క నిబంధన…సామాన్య భక్తులకు మరో నిబంధనలు అమలు చేస్తుందని వెల్లువెత్తుతున్నాయి. దర్శన టోకెన్లు లేదంటూ నిన్న ఉదయం వందలాది మంది భక్తులను అలిపిరి వద్దే నిలిపివేసిన టీటీడీ. ఎటువంటి టోకన్లు లేనప్పటికీ అమర్నాథ్ రెడ్డితో అన్నమయ్య మార్గాన వచ్చిన భక్తులకు టీటీడీ దర్శనాన్ని కల్పించింది.
దీంతో టీటీడీ తీరు పై భక్తులు మండిపడుతున్నారు. ఇక మరోపక్క టీటీడీలో మరో సారి అన్యమత ఉద్యోగుల వివాదం తెర పైకి వచ్చింది. తొమ్మిది మంది అన్యమత ఉద్యోగుల పై విచారణకు ఆదేశించింది హై కోర్టు. ముందుగా నోటీసులు పంపి, మూడు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు టీటీడి ఈవో, చైర్మన్, దేవాదాయ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.