పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ఇద్దరు హీరోయిన్లు..?

-

ప్రస్తుతం డ్రగ్స్ కేసు క్రమక్రమంగా అన్ని ఇండస్ట్రీలకు పాకుతూ పోతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే శాండిల్ వుడ్ ని కూడా డ్రగ్స్ కేసు ఊపేసింది . ఎంతో మంది సినీ ప్రముఖులు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజన రాగిని అనే ఇద్దరు హీరోయిన్లను అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిని తమ కస్టడీలో ఉంచుకొని విచారణ కొనసాగిస్తున్నారు ప్రస్తుతం అధికారులు.

అయితే ప్రస్తుతం ఆ ఇద్దరు హీరోయిన్లు అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. సంజన రాగిణి లకు ముందు నుంచే విభేదాలు ఉన్న కారణంగా ఎప్పుడు మాటల యుద్ధం చేసే వారిని ఇక ఇప్పుడు ఆ ఇద్దరినీ ఒకే సెల్లో వేయడంతో వారు ఫిర్యాదుల తో అధికారులను విసిగిస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది. దీంతో వారిని ఎలా సముదాయించాలో తెలియక చివరికి చేసేదేమీ లేక ఇద్దరినీ కూడా వేరే వేరే సెల్ లలో అధికారులు వేసినట్లు తెలుస్తోంది. ఇక ఒకరిపై ఒకరు సరికొత్త కారణాలతో అధికారులకు ఫిర్యాదు చేయడం కారణంగానే ఇలా ఇద్దరిని వేర్వేరు సెల్ లో వేయడం మంచిది అని అధికారులు భావించారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version