దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ సేవల వలన చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్ సర్వీసులు ని కూడా ఇస్తోంది. డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ప్రత్యేకమైన స్కీమ్స్ ని బ్యాంకు ఇస్తోంది. ఎస్‌బీఐ ఉయ్ కేర్ ఎఫ్‌డీ, ఎస్‌బీఐ అమృత్ కలశ్ వంటి స్కీమ్స్ కూడా దీనిలో వున్నాయి. వీటితో ఎక్కువ రాబడి వస్తుంది. అయితే ఈ స్కీమ్స్ పరిమిత కాలం దాకే ఉంటాయి.
ఈ రెండు స్పెషల్ డిపాజిట్ స్కీమ్స్ కూడా మార్చి 31 వరకే అందుబాటులో ఉంటాయి. ఆ తరవాత నుండి వుండవు. కనుక మీరు దీనిలో డబ్బులు దాచుకోవాలని భావిస్తూ ఉంటే ఈ స్కీమ్స్ బెనిఫిట్స్‌ను కేవలం ఇప్పుడే పొందడానికి అవుతుంది. కానీ ఆ తరవాత మీరు దీనిలో డబ్బులని పెట్టాలని అనుకుంటే మాత్రం కుదరదు.
అమృత్ కలశ్ డిపాజిట్ స్కీమ్ వివరాలు:
టెన్యూర్ 400 రోజులు. 7.1 శాతం వడ్డీ పొందొచ్చు. అదే సీనియర్ సిటిజన్స్ కి 7.6 శాతం వరకు వడ్డీ వస్తుంది. డొమెస్టిక్ లేదా ఎన్ఆర్ఐ కస్టమర్లు దీనిలో డబ్బులు పెట్టుకోవచ్చు. ప్రిమెచ్యూర్ విత్‌డ్రాయెల్, లోన్ ఫెసిలిటీ వంటివి కూడా దీనిలో వున్నాయి. రూ. లక్ష ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ. 8 వేల రాబడి వస్తుంది.
సీనియర్ సిటిజన్స్ ఉయ్ కేర్ స్కీమ్ వివరాలు:
దీనిలో చేరి అధిక వడ్డీ పొందొచ్చు. లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి దీనిలో మీరు చేరవచ్చు. ఐదేళ్ల లేదా పదేళ్ల టెన్యూర్‌తో ఇందులో చేరచ్చు. నెల, మూడు నెలలకు ఒకసారి వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కు ఎఫ్‌డీలపై 50 బేసిస్ పాయింట్లు ఎక్కువగా వడ్డీని ఇస్తున్నారు.