అండర్ – 19 ప్రపంచ కప్ చివరి దశకు చేరుకుంది. నేడు రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టుతో యంగ్ టీమిండియా తల పడనుంది. కాగ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆఫ్ఘానిస్థాన్ పై ఇంగ్లాండ్ జట్టు విక్టరీ కొట్టింది. దీంతో ఇంగ్లాండ్ నేరుగా ఫైనల్ కు అర్హత సాధించింది. ఈ రెండో మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు ఈ నెల 5న జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో తలపనుంది. కాగ ఇప్పటి వరకు యంగ్ టీమిండియా ఒక్క మ్యాచ్ లో కూడా ఓటమి చెందకుండా.. సెమీ ఫైనల్ కు చేరుకుంది.
కరోనాతో ప్రధాన ఆటగాళ్లు అందరూ దూరం అయినా.. రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లతోనే భారీ విజయాలను నమోదు చేసింది. అయితే ఇప్పుడు కెప్టెన్ యశ్ ధుల్ తో పాటు మరో నలుగురు ప్రధాన ప్లేయర్లు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో వీరు ఆస్ట్రేలియా తో జరగబోయే సెమీ ఫైనల్ మ్యాచ్ కు అందుబాటులో ఉండనున్నారు.
అయితే ఈ టోర్నీలో బలమైన జట్టులలో ఒక్కటి అయిన ఆస్ట్రేలియా జట్టుపైన విజయం సాధిస్తుందా.. అనే ప్రశ్న మాత్రం ఉంది. అయితే టీమిండియా కుర్రాళ్ల ఫామ్ చూస్తే.. విజయం ఖాయంగానే అనిపిస్తుంది. రఘువంశి, రవికుమార్, విక్కీ, రాజ్ ఇప్పటివరకు మెలైన ప్రదర్శన చేశారు. వీరి ఫామ్ ఇలాగే ఈ మ్యాచ్ లో కొనసాగిస్తే.. భారత్ ఫైనల్ కు చేరడం పెద్ద విషయం కాదనే చెప్పాలి.