యూపీఎస్సీ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు..గతంలో ఉన్న పోస్టుల కంటే ఎక్కువ పోస్టులను భర్తీ చేయనున్నారు..మొత్తం 339 పోస్టుల్ని ప్రకటించింది. హైదరాబాద్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పలు ఖాళీలున్నాయి. ఈ ఎగ్జామినేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు 2022 జూన్ 7 లోగా దరఖాస్తు చేయాలి. డిగ్రీ పాసైనవారు అప్లై చేయొచ్చు. 2022 సెప్టెంబర్ 4న ఎగ్జామ్ ఉంటుంది. ఎంపికైనవారికి ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో అడ్మిషన్ లభిస్తుంది. శిక్షణ తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో పోస్టింగ్ ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం ఖాళీలు: 339
ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రడూన్100ఇండియన్ నావల్ అకాడమీ, ఎజిమల22ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్32ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (పురుషులు)169ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మహిళలు)16
నోటిఫికేషన్:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మే 18, 2022
చివరి తేదీ : దరఖాస్తుల ఉపసంహరణ- 2022 జూన్ 14 నుంచి 2022 జూన్ 20 సాయంత్రం 6 గంటల వరకు
పరీక్ష తేదీ- 2022 సెప్టెంబర్ 4
కోర్సు ప్రారంభం- 2023 జూలై
విద్యార్హతలు: ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో అడ్మిషన్ల కోసం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. ఇండియన్ నావల్ అకాడమీలో అడ్మి,న్ల కోసం ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ కావాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో అడ్మిషన్ల కోసం బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా డిగ్రీ పాస్ కావాలి. (ఇంటర్మీడియట్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్ తప్పనిసరి)
వయస్సు:ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీ కోసం అప్లై చేసే అభ్యర్థులు 1999 జూలై 2 నుంచి 2004 జూలై 1 మధ్య జన్మించినవారై ఉండాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీ కోసం అప్లై చేసే అభ్యర్థులు 1999 జూలై 2 నుంచి 2003 జూలై 1 మధ్య జన్మించినవారై ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.200. ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
పరీక్షా కేంద్రాలు: తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి.
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని అనుకొనే వాళ్ళు బ్యాచిలర్స్ అయ్యి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. ఈ ఉద్యొగాలకు సంబంధించిన పూర్తీ వివరాల కోసం అధికార వెబ్ సైట్ ను వీక్షించాలి.