‘నీటిలో తేలియాడుతున్న బుడగలాంటిది బీజేపీ’: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

-

తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని అనుకోవాల్సిన అవసరం లేదని.. ఆ పార్టీ నీటిలో తేలియాడుతున్న బుడగలాంటిదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గాంధీ భవన్‌లో నిర్వహించిన పీసీసీ అనుమంధ సంఘాలా సమావేశంలో ఆయన మాట్లాడారు. నీటిపై తేలాడే గాలి బుడగ ఎంతసేపు ఉంటుందో తెలియని.. తెలంగాణలోనూ బీజేపీ అలాగే ఉందని ఎద్దేవా చేశారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెలో రూ. 60 వేల కోట్ల అప్పుచేస్తే కేవలం ఆరేళ్లలో టీఆర్‌ఎస్‌ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.3 లక్షల కోట్లు అప్పులు చేసి సామాన్యులపై భారం మోపుతుందని విమర్శించారు.

భద్రాద్రి గురించి మాట్లాడండి..

ఎన్నికలో సమయంలో ఉద్యోగభర్తీలపై హామీలు గుప్పించిన బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఇప్పుడు వాటిని విస్మరించి నిరుద్యోగులకు తీవ్ర అన్యాయవ చేశాయని ధ్వసమెత్తారు. ఎప్పుడు అయోధ్య గురించి మాట్లాడే బీజేపీ నేతలు, భద్రాద్రి గురించి ఒక్కసారైనా ఎందుకు మాట్లాడం లేదని ప్రశ్నించారు. మతపిచ్చి ఉన్న బీజేపీ మూలంగా తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ప్రతి గ్రామం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ బలంగా ఉందని రానున్న రోజుల్లో అధికారంలోకి రావడం ఖాయమని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఐటీఐఆర్‌ రద్దుచేసి యువతకు తీవ్ర అన్యాయం చేశారని మండి పడ్డారు. కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అవలంభిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ఇంటింటికి వెళ్లి వివరించి వారిని గద్దె దించాలని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ప్రజల వద్దకు వస్తారని ఫలితాలు వెలువడిన మరోక్షణం నుంచి అటువైపు కన్నెతి చూడరని విమర్శించారు. స్వార్థరాజకీయ పార్టీలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version