అందరం కలిసి పనిచేసి.. మునుగోడులో గెలుద్దామని కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరారు వి.హనుమంతరావు. కాంగ్రెస్ అభ్యర్థి ని ప్రకటించి ముందుకు వెళతామని.. పార్టీకి పూర్వవైభవం రావాలంటే అందరం కలిసి పని చేయాలని పేర్కొన్నారు. మనసులో ఎం ఉన్న అన్ని పక్కన బెట్టాలని… బట్టలు మార్చినట్టు పార్టీలు మారుస్తున్నారని ఆగ్రహించారు.
పార్టీ కష్టకాలంలో ఉంది..అందరం కలిసి పని చేద్దామని కోరారు వీహెచ్. సెప్టెంబర్ 4 నపెరిగిన ధరల మీద కాంగ్రెస్ పోరాటం చేస్తుంది…నేను కూడా స్వయంగా పాల్గొంటానన్నారు. మునుగోడు లో ఇంటింటికి వెళ్లి ధరల పెరుగుదలపై చెప్పాలని.. ధరల పై ప్రజల దృష్టిని మరల్చడానికి మత గొడవలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నూపుర్ శర్మ ,రాజాసింగ్ మహమ్మద్ ప్రవక్త మీద చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు.. రైతులకు ,సైనికుల నోట్లో మట్టి కొడుతున్నారని నిప్పులు చెరిగారు వి.హనుమంతరావు. నరేంద్ర మోడీ 8 ఏళ్లలో ఒక్క పని చేయలేదని విమర్శలు చేశారు.