వాక్సిన్ తీసుకుంటే ఆస్పత్రికి వెళ్ళే ఛాన్స్ ౦.6 శాతమే…?

-

కరోనా వాక్సిన్ తీసుకున్న వాళ్ళు కరోనా బారిన పడితే ఆస్పత్రికి వెళ్ళాలా లేదా అనే అంశానికి సంబంధించి స్పష్టత లేదు. అయితే తాజాగా ఒక సర్వేలో మాత్రం అంత అవసరం లేదనే విషయం బయటకు వచ్చింది. కరోనా వాక్సినేషన్ తర్వాత 0.06 శాతం మందికి మాత్రమే ఆసుపత్రి అవసరం అని టీకాలు వేసిన వారిలో 97.38 శాతం మంది వైరస్ నుంచి రక్షణ పొందారని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ అధ్యయనం వెల్లడించింది.

కోవిడ్ -19 యొక్క ‘బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్’ (టీకా తర్వాత అంటువ్యాధులు) ఫ్రీక్వెన్సీని అంచనా వేయడానికి ఆసుపత్రి ఈ అధ్యయనం చేసింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ తీసుకున్న మొదటి 100 రోజులలో ఈ అధ్యయనం చేసారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అనుపమ్ సిబల్ ఈ విషయాలను వెల్లడించారు. కరోనా వాక్సిన్ అనేది రోగ నిరోధక శక్తిని అందించింది అని సర్వే గుర్తించింది.

3,235 మంది ఆరోగ్య కార్యకర్తలపై (హెచ్‌సిడబ్ల్యు) ఈ అధ్యయనం చేసింది. 3,235 మంది ఆరోగ్య కార్యకర్తలలో మొత్తం 85 మంది అధ్యయన కాలంలో కరోనా బారిన పడ్డారు. వీరిలో 65 (2.62 శాతం) మందికి పూర్తిగా టీకాలు వేయగా, 20 (2.65 శాతం) మందికి పాక్షికంగా టీకాలు వేశారు. ఆడవారికే ఎక్కువగా వీరిలో కరోనా సోకిందని వయసుతో సంబంధం లేకుండా కరోనా బారిన పడ్డారని గుర్తించారు. కరోనా తర్వాత ఎదురయ్యే పరిణామాలను కూడా వాక్సిన్ ఎదుర్కొంటుంది అని సర్వేలో గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version