కూలీల పంట పండింది.. రాళ్లు అమ్మి లక్షలు సంపాదించారు..

-

మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో గనుల్లో పనిచేస్తున్న కార్మికుల పంటపండింది. విలువైన వజ్రాలు దొరకడంతో కేవలం ఒక్క రోజులోనే లక్షాధికారులు గా మారిపోయారు కార్మికులు. 7.44, 14.98 క్యారెట్ల బరువున్న వజ్రాలు దొరకడంతో కార్మికులు ఎగిరి గంతేసారు అని చెప్పాలి, ఇక వజ్రాలను డైమండ్ కార్యాలయంలో వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. అయితే 7.44 క్యారెక్టర్ బరువున్న వజ్రానికి ఏకంగా 30 లక్షల వరకు లభించినట్లు తెలుస్తోంది. ఇక అంతకంటే ఎక్కువ ఉన్న వజ్రానికి రెట్టింపు ధర పలికే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అధికారులు చెబుతున్నారు.

ఇక ఇంతటి విలువైన వజ్రాలు దొరకడంతో కార్మికుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది అని చెప్పాలి . వచ్చిన డబ్బులతో మంచి ఇల్లు కట్టుకోవడం తో పాటు పిల్లల చదువులు కూడా చూసుకుంటాము అంటూ సదరు కార్మికులు చెబుతున్నారు. నాలుగు నెలల నుండి వజ్రాలను కనుగొనేందుకు ఎంతగానో శ్రమిస్తున్నామని తమ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కింది అంటూ సంతోషం వ్యక్తం చేశారు కార్మికులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version