ఈకాలంలో పిల్లలకు పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు సముద్రాన్ని ఈదినంత కష్టంగా మారింది. పిల్లలకు 30 ఏళ్లు దాటినా పెళ్లి కావడం లేదని తల్లిదండ్రులు పడే బాధ అంతా ఇంతా కాదు. తమ కొడుకు/కూతురికి త్వరగా పెళ్లి జరగాలని, మంచి సంబంధం రావాలని కన్నవాళ్లు మొక్కని మొక్కు లేదు, చేయని పూజ లేదు. అయితే ఇలా రకరకాల పూజలు చేసే బదులు ఓసారి మీ ఇంట్లో వాస్తు పరిస్థితులను గమనించాలని జ్యోతిష్కులు చెబుతున్నారు. కొన్ని వాస్తు చిట్కాలు పాటిస్తే వివాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయని అంటున్నారు. ఇంతకీ ఆ వాస్తు చిట్కాలేంటో తెలుసుకుందామా..?
అమ్మాయిలకు వివాహ సంబంధాలు వచ్చినవి వచ్చినంటే వెళ్తుంటే.. ఏ సంబంధం సరిగ్గా కుదరకపోతే వాస్తు దోషం ఉన్నట్లే. అయితే పెళ్లికాని అమ్మాయిలు ఇంటి వాయువ్య దిశలో నిద్రపోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంటి నైరుతి మూలలో అస్సలు నిద్రించకూడదని అంటున్నారు. ఇలా చేయడం ద్వారా పెళ్లి అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా, అబ్బాయిలేమో ఈశాన్య దిశలో పడుకోవాలని.. ఆగ్నేయ దిశలో పడుకోకూడదని సూచిస్తున్నారు.
మీరు నిద్రించే బెడ్‌పై బెడ్‌షిట్ పింక్, పసుపు, లేత ఊదా, తెలుపు వంటి లేత రంగు మాత్రమే ఉండాలట. అలా ఉంటేనే మంచిదట. ఈ రంగుల గదిలో సానుకూల శక్తిని పెంచి మీకు పాజిటివ్ వైబ్స్‌ని క్రియేట్ చేస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు.
పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిల మంచం మీద ఇనుప వస్తువులు ఉండకూడదు. అలాగే తమ గదిని శుభ్రంగా ఉంచుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు.
ఇంటి మధ్యలో భారీ వస్తువులు లేదా మెట్లు ఉండకూడదు. దీనివల్ల ఇంట్లో ఉన్న వారి వివాహం ఆలస్యమవుతుంది. ఏదో ఒక అడ్డంకు వస్తూ పోస్ట్‌పోన్ అవుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.
కొందరు ఇంటికి రకరకాల రంగులు వేస్తుంటారు. అయితే ఇల్లు మొత్తం లేత రంగు గోడలే ఉండాలట. దీనికోసం పాస్టెల్ రంగులు ఎంచుకోవాలని పండితులు చెబుతున్నారు. ముదురు రంగులు మాత్రం అసలు ఉపయోగించొద్దని సూచిస్తున్నారు.
వాస్తు ప్రకారం పెళ్లికాని అమ్మాయిలు, అబ్బాయిలు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. ఈ రంగు నిరాశకు చిహ్నంగా పరిగణిస్తారు. ఈ రంగు దుస్తులు వేసుకున్న వారిని శని, రాహకేతువులు ఆకర్షిస్తారు. ఫలితంగా వివాహానికి అడ్డంకులు ఏర్పడతాయి. వీలైతే ఎక్కువగా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి.
ఇవన్నీ కేవలం వాస్తు నమ్మే వారికే. వివాహం ఆలస్యమవుతోందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు సరైన భాగస్వామి దొరికినప్పుడే వివాహం చేసుకుంటే మంచిది. లేకపోతే తర్వాత రెండు కుటుంబాలు బాధ పడాల్సి వస్తుంది.