ఖమ్మంలో హీరో వెంకటేష్ ప్రచారం డేట్ ఫిక్స్..!

-

తెలంగాణలో ఒక పార్టీ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడానికి హీరో వెంకటేష్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి గెలుపు కోసం వెంకటేష్ ప్రచారాన్ని చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్ కూతురు ఆశ్రీత ని రఘురాం రెడ్డి పెద్ద కొడుకు వినాయక రెడ్డి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ వెంకి ప్రచారంతో మరింత కలిసి వస్తుంది అని రఘురాం రెడ్డికి వర్గీయులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వియ్యంకుడి గెలుపు కోసం హీరో రంగంలోకి దిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మే 7న ఖమ్మంలో వెంకటేష్ తో ప్రచారం చేయడానికి షెడ్యూల్ ఫిక్స్ అయినట్లు పార్టీ వర్గాల నుండి సమాచారం ఖమ్మం పార్లమెంట్ వరకు మాత్రమే వెంకీ ప్రచారం ఉందని తెలుస్తుంది. ఇంకోపక్క మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సైతం రఘురాం రెడ్డి వియ్యంకుడు అవుతారు ఆయన కూడా వియ్యంకుడు గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version