తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. అయితే ఆయన హైదరాబాద్ లో కాకుండా ఎర్రవల్లిలో ఉన్న తన ఫాం హౌస్ లో ఉన్నారు. అయితే ఆయనను ఫామ్ హౌస్ లోనే వారం పది రోజులు ఉండాలని సలహా ఇచ్చామని కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు తెలిపారు. కేవలం ఆయనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని దీంతో ఇబ్బంది ఏమీ లేదని అన్నారు.
ఏదైనా అవసరమైతే హైదరాబాద్ కు వస్తారన్న ఆయన సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో ముఖ్యమంత్రి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అన్నారు. ఇక కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వాకబు చేశారు. కేసీఆర్ కు ఫోన్ చేసిన ఆయన ఎలా ఉండనే అంశం అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్నీ కేసీఆర్ సన్నిహితుడు, టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వెంకయ్య కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారని ఆయన అన్నారు.