VIRAL : సెక్యూరిటీ గార్డును టీజింగ్‌ చేసిన టాలీవుడ్‌ హీరోయిన్‌..

-

టాలీవుడ్‌ హీరోయిన్‌.. ఆదాశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యంగ్‌ హీరో నితిన్‌ నటించిన హార్ట్‌ ఎటాక్‌ సినిమాతో టాలీవుడ్‌ జనాలకు బాగా దగ్గరైన బ్యూటీ ఆదా శర్మ. పూరి జగన్నాథ్‌ దర్శకత్వలో వచ్చిన ఈ సినిమా అనుకున్నంతగా సక్సెస్‌ కాకపోయినప్పటికీ ఈ అమ్మడి అందానికి చాలా మంది మంత్ర ముగ్ధులయ్యారు. కేవలం గ్లామర్‌ ప్రజెంటేషన్‌ కోసం చిన్న చిన్న పాత్రలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆదాశర్మ సోషల్‌ మీడియాలో చాలా అట్రాక్ట్‌ చేస్తుంటుంది.

ఇది ఇలా ఉండగా..ప్రస్తుతం హీరోయిన్‌ ఆదాశర్మ యూకే ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తుంది. అయితే.. అక్కడ ఓ ఇంగ్లీష్‌ సెక్యూరిటీ గార్డును టీజింగ్‌ చేసింది ఆదాశర్మ. సెక్యూరిటీ పక్కన నిలుచుకుని.. పాట పాడుతూ.. అతన్ని ఇమిటేట్‌ చేసింది ఆదాశర్మ. ఇలా దాదాపు 5 నిమిషాల పాటు ఆ సెక్యూరిటీ గార్డును ఎడిపించింది. చివరికి అతడు కాస్త సీరియస్‌ కావడంతో.. అక్కడి నుంచి మెల్లిగా జారుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version