పాతికేళ్లు ఏడుస్తూనే ఉండండన్న విజయసాయి, కౌంటర్ ఇచ్చిన బుద్ధా !

-

సోషల్ మీడియాలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వర్సెస్ టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నట్టు మారింది పరిస్థితి. ఎప్పుడు విజయసాయి కామెంట్ చేసినా దానికి వెంటనే రిటార్ట్ ఇవ్వడనికి బుద్ధా రెడీగా ఉంటారు. ఈరోజు కూడా విజయసాయి చేసిన కామెంట్ కి ఆయన కౌంటర్ ఇచ్చారు. ముందుగా విజయసాయి జగనన్న విద్యాకానుక పేరుతో పేదలపై ఉన్న కడుపుమంటను పచ్చనేతలు కక్కేస్తున్నారని అన్నారు. పార్టీ రంగులున్నాయని కొందరు, టీడీపీ కూడా ఇచ్చిందని మరికొందరు అంటున్నారని అన్నారు. హై క్వాలిటీ కిట్ లను అందించడంతో ఇక చేసేదిలేక చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, ఇంకో పాతికేళ్లు ఈ ఏడుపు ఏడుస్తూనే ఉండండని అంటూ ట్వీట్ చేశారు.

దీంతో ట్విట్టర్ లో విజయసాయి రెడ్డి కి కౌంటర్ ఇచ్చిన టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దోచిన 43 వేల కోట్లు ఇచ్చి జగన్ మావయ్య అయ్యాడా సాయిరెడ్డి? అని ప్రశ్నించారు. దొంగ మామ ఇచ్చిన బ్యాగ్ స్కూల్ తెరవకముందే చిరిగిపోయింది అని పిల్లలు కంప్లైంట్ చేస్తున్నారని ఆయన అన్నారు. టిడిపి హయాంలో ఉన్న సైకిళ్ల పంపిణీ ఎత్తేశావ్, పేద విద్యార్థులకు వరంలా ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని ఎత్తేసారు. అలాంటిది పిల్లలు పెట్టుకునే బెల్టుకి పార్టీ రంగులు వేసుకునే చిల్లర బ్యాచ్ మీరు అంటూ ఆయన ఫైర్ అయ్యారు. 17 నెలలకే నీ అల్లుడు హ్యాండ్స్ అప్ అన్నాడని, ఇక 25 ఏళ్ళు జైలు జీవితం ఖాయమే సాయి రెడ్డి అంటూ ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version