చంద్ర‌బాబుపై దారుణ‌మైన కామెంట్లు చేసిన విజ‌య‌సాయి.. అస్స‌లు త‌గ్గ‌ట్లే..!

-

ఏపీ వైసీపీలో జ‌గ‌న్ త‌ర్వాత కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి త‌న‌కు ఏమాత్రం సందు దొరికినా దాన్ని చంద్ర‌బాబుకు ఆపాదిస్తూ త‌న‌దైన స్టైల్‌లో కౌంట‌ర్లు వేస్తుంటారు. ఇక ఇప్పుడు కూడా ఓ విష‌యంలో దొరికిందే ఛాన్స్ అన్న‌ట్టుగా చంద్ర‌బాబు నాయుడిపై దారుణ‌మైన కామెంట్లు చేశారు ఆయ‌న‌. కాకాపోతే ఈ సారి కొంచెం అతిగా చేసిన‌ట్టు అనిపిస్తుంది.

ఇప్ప‌డు రెండు తెలుగు రాష్ట్రాల న‌డుమ కృష్ణా న‌ది నీళ్ల వివాదం తారా స్థాయిలో న‌డుస్తోంది. ఇరు రాష్ట్రాల నేత‌లు తీవ్ర‌మైన విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు. ఇక దీనిపై నిన్న జ‌గ‌న్ కూడా స్పందించి చంద్ర‌బాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ఆయ‌న క‌నీసం స్పందించట్లేద‌ని వ్యాఖ్యానించారు.

ఇక జ‌గ‌న్ ద‌గ్గ‌ర మార్కులు కొట్టేసేందుకు విజ‌య‌సాయి రంగంలోకి దిగారు. కృష్ణా నీళ్ల వివాదం ఎంత ముదిరితే అంత సంతోషించాల‌ని చూస్తున్న ద్రోహి చంద్రబాబు అంటూ దారుణ‌మైన కామెంట్లు చేశారు. అంతే కాదు చంద్ర‌బాబు రాయలసీమలోకి వ‌స్తే ప్ర‌జ‌లు చిత‌క్కొడుతార‌ని, ఒక‌వేళ కోస్తాకు వెల్తే కారం పెడ‌తారంటూ వివాదాస్ప‌దమైన వ్యాఖ్య‌లు చేశారు ఎంపీ విజ‌య‌సాయి. దీనిపై చంద్ర‌బాబు మాత్రం ఇంకా ఏం స్పందించ‌లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version