‘ఆర్ఆర్ఆర్’ మూవీ గురించి రామ్ చరణ్ అప్ డేట్….!!

-

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాల తరువాత రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా పై విదేశాల్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది.

ఇకపోతే ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఇద్దరు హీరోలతో సహా సినిమాలోని కీలక నటీనటులు పాల్గొంటున్న ఈ షెడ్యూల్ ని సినిమా యూనిట్ ఉదయం సమయంలో ప్లాన్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్, నేటి ఉదయం తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక వీడియో పోస్ట్ పెట్టారు.

ఫ్రెష్ గా మార్నింగ్ టైం లో ఇలా కార్ డ్రైవ్ చేసుకుని లొకేషన్ కి వెళ్లి చాలా రోజులు అయింది,
ప్రస్తుతం జరుగుతున్న ఇటువంటి డే టైం షెడ్యూల్ కోసం నేను ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాను అంటూ ఆయన తన కార్ ని డ్రైవ్ చేస్తున్న వీడియోని చరణ్ పోస్ట్ చేయడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, అజయ్ దేవగన్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు కే కే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను 2020, జులై 30న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు….!!

Read more RELATED
Recommended to you

Exit mobile version