టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియాలో చేదు అనుభవం ఎదురైంది. కోహ్లీ లేని సమయంలో అతడి హోటల్ గదిలోకి వెళ్లిన కొందరు అక్కడి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై కోహ్లీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనంటూ ఇన్‌స్టా వేదికగా అసహనం వ్యక్తం చేశాడు.
“అభిమానులు తమకు ఇష్టమైన ఆటగాళ్లను చూసినప్పుడు ఎంతో ఆనందపడతారని, వాళ్లను కలిసేందుకు ఉత్సాహంగా ఉంటారని నేను అర్థం చేసుకోగలను. అలాంటి అభిమానాన్ని నేను అభినందిస్తాను కూడా. కానీ, ఈ వీడియో భయానకం. నా వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఈ వీడియో చూసి షాక్ అయ్యాను. నా హోటల్ గదిలోనే నాకు ప్రైవసీ లేకపోతే.. ఇంకెక్కడ నాకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందని ఆశించగలను. ఇలాంటి మూర్ఖమైన అభిమానాన్ని నేనెప్పుడూ అంగీకరించలేను. ఇది కచ్చితంగా గోప్యతా ఉల్లంఘనే. దయచేసి ప్రతి ఒక్కరి ప్రైవసీకి గౌరవం ఇవ్వండి. ఎవరినీ వినోద వస్తువుగా చూడొద్దు” అని కోహ్లీ రాసుకొచ్చాడు.
కోహ్లీ రూమ్ వీడియో లీక్పై అనుష్క శర్మ కూడా తీవ్రంగా స్పందించింది. “ఇది కచ్చితంగా మనుషులను ఉల్లంఘించడమే. దీన్ని చూసి ‘సెలెబ్రిటీలే కదా ఇవన్నీ చూసుకోవాలి(సెలబ్రిటీ హో! తో డీల్ కర్నా పడేగా)’ అని ఎవరైనా అంటే.. మీరు కూడా సమస్యలో భాగమే అని తెలుసుకోవాలి. ఇలాంటి విషయాల్లో స్వయం నియంత్రణ ఉండటం అందరికీ మంచింది. ఇలాంటిది మీ బెడ్రూమ్లో జరిగితే.. ఇక హద్దు ఎక్కడ ఉంది” అంటూ ఇన్‌స్టా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది.