ఇదేం సిక్స్ రా బాబు… తల పట్టుకున్న కోహ్లీ…!

-

బంగ్లాదేశ్ తో జరిగిన చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రత్యర్ధిని ఏ దశలోనూ కోలుకోనీయలేదు కోహ్లి సేన. భారత బౌలర్ల సమిష్టి కృషితో పింక్ బాల్ క్రికెట్ లో తొలి విజయాన్ని టీం ఇండియా నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఇషాంత్ శర్మ 5 వికెట్లు, బ్యాటింగ్ లో కోహ్లి రికార్డ్ సెంచరీతో మంచి స్కోర్ సాధించడం, వెరసి రెండో ఇన్నింగ్స్ లో ఉమేష్, ఇషాంత్ నిప్పులు చెరగడంతో చరిత్రలో నిలిచిపోయే ఇండియన్ క్రికెట్ మక్కాలో బంగ్లాదేశ్ ఓటమి పాలైంది.

ఇక ఈ మ్యాచ్ లో భారత బౌలర్లే హైలెట్ గా నిలిచారు. మంచు పడుతున్న సమయంలో ఏ విధంగా బౌలింగ్ చేస్తారో అనే ప్రశ్నలకు ఇషాంత్, ఉమేష్ యాదవ్ తమ పని తీరుతోనే సమాధానం చెప్పారు. రెండు ఇన్నింగ్స్ లలో కూడా ప్రత్యర్ధిని కట్టడి చేసి చుక్కలు చూపించారు. వీళ్ళ ధాటికి బంగ్లా జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. కీలకమైన సమయంలో టాప్ ఆర్డర్ చేతులు ఎత్తేసింది. సొంత అభిమానులు వేలాది మంది ఉన్నా సరే బంగ్లాదేశ్ చతికిలపడింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో ఆసక్తికర సంఘటన ఒకటి చోటు చేసుకుంది.

షమీ బౌలింగ్‌లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్స్ మెహిదీ హసన్‌ కొట్టిన సిక్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. షమీ వేసిన షార్ట్ బాల్‌ మెహిదీ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని అనూహ్యంగా సిక్స్ వెళ్ళింది. ఎన్నో ఏళ్లుగా మ్యాచ్‌లను వీక్షిస్తున్నామని, కానీ ఇలాంటి సిక్స్ ఎప్పుడు చూడలేదని సంజయ్ మంజ్రేకర్ కూడా కామెంటరి బాక్స్ లో కూర్చుని వ్యాఖ్యానించాడు. ఇక ఈ సిక్స్ చూసిన కోహ్లి రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది… శమి అయితే కాసేపు పిచ్ మీదే నిలబడి ఉండిపోయాడు. ఈ వీడియో ని బిసిసిఐ తమ వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version