ఆసక్తి రేపుతున్న సాయిధరమ్‌తేజ్‌ ‘విరూపాక్ష’ టీజర్‌

-

ప్రమాదం నుంచి కోలుకున్న తరువాత సాయిధరమ్‌తేజ్‌ చేసిన మొదటి సినిమానే ‘విరూపాక్ష’. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. టైటిల్ తోనే అందరిలో ఆసక్తిని పెంచుతూ వెళ్లింది ఈ సినిమా. సంయుక్త మీనన్ ఈ సినిమాలో కథానాయికగా నటించారు. పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా టీజర్ ను ముందుగా చూపించారు. ఆయనకి ఈ టీజర్ బాగా నచ్చినట్లు సమాచారం. దీంతో అభిమానుల్లో మరింతగా కుతూహలం పెరుగుతూ వచ్చింది. కొన్ని కారణాల వలన నిన్ననే రిలీజ్ కావలసిన ఈ టీజర్ వాయిదా వేయడం జరిగింది. కొంతసేపటి క్రితమే ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. ‘చరిత్రలో ఇలాంటి ఒక సంఘటన జరగడం ఇదే మొదటిసారి. దీని నుంచి బయటపడటానికి ఒకే ఒక మార్గం ఉంది’ అనే డైలాగ్ సినిమాపై అభిమానులకు ఇంకా ఆసక్తిని పెంచుతోంది.

Sai Dharam Tej | Virupaksha Teaser : సాయి తేజ్ విరూపాక్ష టీజర్ విడుదల..  అదిరిన రెస్పాన్స్.. Sai Dharam Tej Virupaksha Movie teaser released gets  good response– News18 Telugu

హారర్ టచ్ తో నడిచే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ కథ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి అజనీశ్ లోక్ నాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమ ఏప్రిల్ 21వ తేదీన విడుదల కానుంది. చాలా గ్యాప్ తరువాత సాయితేజ్ చేసిన ఈ సినిమాకి తప్పకుండా హిట్ తెచ్చి పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news