ఆసక్తి రేపుతున్న సాయిధరమ్‌తేజ్‌ ‘విరూపాక్ష’ టీజర్‌

-

ప్రమాదం నుంచి కోలుకున్న తరువాత సాయిధరమ్‌తేజ్‌ చేసిన మొదటి సినిమానే ‘విరూపాక్ష’. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. టైటిల్ తోనే అందరిలో ఆసక్తిని పెంచుతూ వెళ్లింది ఈ సినిమా. సంయుక్త మీనన్ ఈ సినిమాలో కథానాయికగా నటించారు. పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా టీజర్ ను ముందుగా చూపించారు. ఆయనకి ఈ టీజర్ బాగా నచ్చినట్లు సమాచారం. దీంతో అభిమానుల్లో మరింతగా కుతూహలం పెరుగుతూ వచ్చింది. కొన్ని కారణాల వలన నిన్ననే రిలీజ్ కావలసిన ఈ టీజర్ వాయిదా వేయడం జరిగింది. కొంతసేపటి క్రితమే ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. ‘చరిత్రలో ఇలాంటి ఒక సంఘటన జరగడం ఇదే మొదటిసారి. దీని నుంచి బయటపడటానికి ఒకే ఒక మార్గం ఉంది’ అనే డైలాగ్ సినిమాపై అభిమానులకు ఇంకా ఆసక్తిని పెంచుతోంది.

హారర్ టచ్ తో నడిచే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ కథ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి అజనీశ్ లోక్ నాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమ ఏప్రిల్ 21వ తేదీన విడుదల కానుంది. చాలా గ్యాప్ తరువాత సాయితేజ్ చేసిన ఈ సినిమాకి తప్పకుండా హిట్ తెచ్చి పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version