విశాఖ స్టీల్ ప్లాంట్ నూత‌న రికార్డు

-

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్ప‌త్తిలో నూత‌న రికార్డులు నెల‌కొల్పుతుంది. ఈ నెల‌లోనే ఐదుసార్లు అత్య‌ధికంగా హాట్ మెట‌ల్ ఉత్ప‌త్తి చేసి రికార్డుల‌ను న‌మోదు చేసిన స్టీల్ ప్లాంట్‌ను తాజాగా వాటిని అధిగ‌మించింది. ఆవిర్భావ దినోత్స‌వం రోజు శుక్ర‌వారం బ్లాస్ట్ ఫ‌ర్నేస్ -1లో 8,019 ట‌న్నుల హాట్ మెట‌ల్‌ను ఉత్ప‌త్తి చేసింది.

అంత‌కు ముందు అత్య‌ధికంగా ఈనెల 08న 7,620 ట‌న్నులు, ఫిబ్ర‌వ‌రి 13న 7,670 ట‌న్నులు, ఫిబ్ర‌వ‌రి 15న 7,730 ట‌న్నులు, 16న 7,835 ట‌న్నులు, 17న ఉత్ప‌త్తి 7,874 ట‌న్నులు ఉత్ప‌త్తి ద్వారా నెల‌కొల్పిన రికార్డుల‌ను అధిగ‌మించింది. కార్మికుల‌ను సీఎండీ అతుల్‌భ‌ట్‌, ఆప‌రేష‌న్స్ డైరెక్ట‌ర్ ఏకే సక్సేనా అభినందించారు. ఇలాంటి రికార్డుల‌ను ముందు ముందు మ‌రిన్ని సాధించాల‌ని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version