మీరు తక్కువ ఆహారం తింటున్నారని చెప్పడానికి సంకేతాలు..

-

ఏదీ ఎక్కువ చేయకూడదు అని ప్రతీసారి వినిపిస్తూ ఉంటారు. అలా అని తక్కువా చేయకూడదు. తక్కువ విషయంలో అన్నింటి గురించి వదిలిపెడితే, మనం తీసుకునే ఆహారం మరీ తగ్గితే అనర్థాలే అని తెలుసుకోవాలి. మీ శరీరానికి ఎంత ఆహారం అవసరం అవుతుందో అంత తీసుకోవాలి. లావు అవుతామనో, లేదా మరింకో కారణం చేతనో తక్కువగా తినడం మీకే నష్టాన్ని కలగజేస్తుంది. మీరు తక్కువ తింటున్నారని చెప్పడానికి మీ శరీరం కొన్ని సంకేతాలని పంపుతుంది. ఆ సంకేతాలేంటో చూద్దాం.

అలసట

ఏదైనా పని చేయడానికి శక్తి ఉండక, చాలా తొందరగా అలసిపోతారు. శరీరానికి సరైన కేలరీలు అందవు కాబట్టి, పని చేయడానికి కావాల్సిన శక్తి ఉండదు. దీనివల్ల అలసిపోతూ ఉంటారు.

జుట్టు రాలిపోవడం

జుట్టు రాలిపోవడానికి కూడా ఆహారం తక్కువ తీసుకోవడం ఒక కారణం అవుతుంది. అది మన శరీరం మీదే పెరుగుతుంది కాబట్టి, దాని పెరుగుదలకి పోషకాలు కావాలి. తక్కువ తింటూ శరీరానికే సరైన పొషణ దొరక్కపోతే వెంట్రుకలకి ఎలా ఉంటుంది. అందుకే అవి రాలిపోతూ ఉంటాయి.

ఎప్పుడూ ఆకలిగా ఉండడం

ఎప్పుడూ ఆకలిగా ఉంటుందని మీకనిపిస్తే మీరు సరిగ్గా తినడం లేదన్నట్టే లెక్క. కేలరీలు అందక మీ కడుపు ఆకలి ఆకలి అని అరుస్తూనే ఉంటుంది.

నిద్ర సమస్యలు

మంచిగా తింటేనే మంచిగా నిద్రపోగలరు. శరీరానికి కావాల్సినంత అందకపోతే ప్రేవులు అరుస్తూనే ఉంటాయి. నిద్రని దూరం చేస్తూనే ఉంటాయి.

చిరాకు

ఊరికూరికే చిన్నదానికే చిటపటలాడుతున్నారంటే ఆకలి ఎక్కువవుతుందనో, లేదా తక్కువ తింటున్నారనో అర్థం. కడుపులో గోల చిరాకు రూపంలో బయటకు వినిపిస్తుంది.

ప్రతీసారీ జలుబు ఉండడం

రెగ్యులర్ గా జలుబు చేస్తున్నట్లయితే మీరు తక్కువ తింటున్నారని గుర్తుంచుకోండి. సరైన పాళ్ళలో ఆహారం తీసుకోనట్లయితే జలుబు ఉంటూ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version