కేంద్ర హోంమంత్రి అమిత్ షాను శనివారం రాత్రి న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో తిరిగి చేర్చారు. రాత్రి 11 గంటల సమయంలో ఆయన్ను ఆసుపత్రి కార్డియో న్యూరో టవర్ లో చేర్చారు. కరోనా తర్వాత ఆయన ఆగస్ట్ 31 న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆయన శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు అని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి.
అయన సమస్యలతో ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉండటమే ఉత్తమం అని వైద్యులు పేర్కొన్నారు. అమిత్ షా ఆగస్టు 2 న కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ క్రమంలోనే గురుగ్రామ్ లోని మెదంత ఆసుపత్రిలో చేరారు. కోలుకున్న తరువాత, ఆయనకు ఆగస్ట్ 14 న కరోనా నెగటివ్ వచ్చింది. ఒంటి నొప్పులు అలాగే అలసట గురించి చెప్పడంతో నాలుగు రోజులకే ఎయిమ్స్ లో చేరారు.