ధరణిలో లోపాలుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

-

ధరణిలో లోపాలున్నాయని, వాటిని తాము గుర్తించామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. 4 నెలల క్రితం ధరణిలో లోపాలున్నాయని చెప్పిన ప్రభుత్వం వాటిని ఎందుకు సరిదిద్ధడం లేదు? అని ప్రశ్నించారు. చట్ట ప్రకారం.. రైతుల భూములు పట్టాలు చేయాలని డిమాండ్ చేశారు.

అద్భుతంగా నడిచిన ధరణిని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల ఉసురు పోసుకోవద్దని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా కాకముందు కష్టాలు వచ్చాయని పేర్కొన్నారు. 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేరస్తామని చెప్పి.. నెరవేర్చలేదన్నారు. రైతులకు రైతుబంధు, 2లక్షల రుణమాఫీ వంటి హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version